నిరసన: జడ్జికి కండోమ్‌లు పంపిన మహిళ..

Woman Sends Condoms To Justice Ganediwala In Protest Over POCSO Rulings - Sakshi

జడ్జి పుష్ప గనేడివాలాకు కండోమ్‌లు పంపిన మహిళ

జడ్జి తీర్పులకు నిరసనగా ఇలా చేశాను: దేవ్‌శ్రీ

ముంబై‌: లైంగిక దాడి కేసులో వివాదాస్పద తీర్పులు వెల్లడించిన  బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్ జడ్జి జస్టిస్‌ పుష్ప గనేడివాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద తీర్పులు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. కేంద్రం ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఓ మహిళ పుష్ప గనేడివాలా తీర్పులను వ్యతిరేకిస్తూ.. నిరసనగా జడ్జికి కండోమ్‌లు పంపింది. అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్‌శ్రీ త్రివేది.. జస్టిస్‌ గనేడివాలా పని చేస్తోన్న బాంబే హైకోర్టు  నాగ్‌పూర్‌ బెంచ్‌ రిజిస్ట్రీతో పాటు ముంబైలోని మరో 12 వేర్వేరు ప్రదేశాలకు కండోమ్‌లు పంపినట్లు వెల్లడించింది. 

ఈ సందర్భంగా దేవ్‌శ్రీ త్రివేది మాట్లాడుతూ.. ‘‘అన్యాయాన్ని నేను సంహించలేను. గనేడివాలా తీర్పు వల్ల ఓ మైనర్‌ బాలికకు న్యాయం జరగలేదు. ఆమెని సస్పెండ్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాను. ఆమె తీర్పు పట్ల నా నిరసన తెలియజేయడం కోసం ఇలా కండోమ్‌ ప్యాకెట్లు పంపాను. మొదట ఈ నెల 9న కొన్ని ప్యాకెట్లు పంపాను. అవి చేరుకున్నట్లు రిపోర్ట్‌ అందింది. ఆ తర్వాత మరో 12 చోట్లకు కండోమ్‌ ప్యాకెట్లు పంపాను అని తెలిపింది.

‘‘ఓ మహిళగా నేను చేసిన పని తప్పని భావించడం లేదు. దీని గురించి నాకు ఎలాంటి చింత లేదు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలి. ఇక జస్టిస్‌ గనేడివాలా లాంటి వారి వాల్ల మగాళ్లు మరింత రెచ్చిపోతారు. ఆడవారిపై అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. అప్పుడు అత్యాచారాలు స్త్రీల దుస్తుల మీదుగానే జరుగుతాయి’’ అంటూ దేవ్‌శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. 

గతంలో బాలికలపై లైంగిక దాడుల కేసులో జస్టిస్‌ పుష్ప గనేడివాలా వివాదాస్పద తీర్పులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘నేరుగా బాలిక శరీరాన్ని తాకుకుండా జరిగే లైంగిక దాడి పోక్సో కిందకు రాదని’’.. ‘బాలిక చేతిని పట్టుకుని అతను ప్యాంట్‌ జిప్‌ తెరిచినంత మాత్రాన లైంగిక దాడిగా పరగణించలేం’’ అంటూ సంచలన తీర్పులు వెల్లడించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. 

చదవండి: చర్మాన్ని చర్మం తాకలేదు గనుక..
                 బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top