చెప్పుతో కొట్టి.. కాళ్ల బేరానికి | Woman Hits Auto Driver With Slipper Near Bellandur Signal | Sakshi
Sakshi News home page

చెప్పుతో కొట్టి.. కాళ్ల బేరానికి

Jun 3 2025 7:43 AM | Updated on Jun 3 2025 9:57 AM

Woman Hits Auto Driver With Slipper Near Bellandur Signal

 ఆటోడ్రైవర్‌కు బిహారీ మహిళ క్షమాపణలు 

శివాజీనగర: ఆవేశంలో కన్నుమిన్ను కానక ఆటో డ్రైవర్‌ను హిందీ మహిళ చెప్పుతో కొట్టింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. జైలు జీవితం తప్పదని గ్రహించిన ఆమె కాళ్ల బేరానికి వచ్చింది. బిహార్‌కు చెందిన వివాహిత పంఖూరి మిశ్రా, ఆమె భర్త ఆటోడ్రైవర్‌ కాళ్లపై పడి క్షమాపణ చెప్పారు.  

క్షమించండి ప్లీజ్‌  
రోడ్డుపై తమ స్కూటర్‌కు తగిలాడని ఆటోడ్రైవర్‌ లోకేశ్‌ను పంఖూరి మిశ్రా చెప్పుతో బాదింది. వీడియో తీస్తావా.. తీయ్‌ అని కూడా బూతులు తిట్టింది. ఈ వీడియో వైరల్‌ కాగా మిశ్రా అకృత్యంపై జనం మండిపడ్డారు. ఆటోడ్రైవర్‌ ఫిర్యాదు మేరకు ఆమె మీద బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆ జంటను పిలిపించి విచారణ జరిపారు. నేను గర్భవతిని, ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో తగిలింది, కోపంతో దాడి చేశాను, ఆటోడ్రైవర్‌ నాపై దాడికి ప్రయత్నించాడు అని తెలిపింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని బెయిలు ఇచ్చి పంపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఆటోడ్రైవర్‌కు క్షమాపణలు చెప్పారు.  కన్నడిగులు తమను క్షమించాలని, బెంగళూరును, ఇక్కడి సంస్కృతిని ప్రేమిస్తున్నామని, కావాలని చేయలేదని పంఖూరి వివరణ ఇచ్చింది.   

ఆటోడ్రైవర్ల ధర్నా  
మరోవైపు చెప్పుల దాడిని ఖండిస్తూ బెంగళూరులో ఆటోడ్రైవర్ల సంఘం ధర్నా చేసింది. ఫ్రీడంపార్క్‌లో వందలాదిగా చేరి నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని, దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement