
అమావాస్య రోజున భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..
మైసూరు: భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య ఉదంతం మైసూరు నాచనహళ్లిపాళ్య 8వ క్రాస్‌లో జరిగింది. రఫీ, సమ్రిన్ దంపతులు. కాగా భర్త తనతో సరిగా మాట్లాడటం లేదని భావించిన సమ్రిన్ భర్త రఫీపై క్షుద్రపూజలు చేయించింది. ప్రతి అమావాస్య రోజున ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, ఉప్పు తదితర వస్తువులను వేయిస్తుం డేది. మంగళవారం రాత్రి కూడా సమ్రిన్ ఆ వస్తువులను పడేస్తూ ఉండగా బంధువులు స్థానికుల సహాయంతో సమ్రిన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని విద్యారణ్యపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.