ఐపీఎస్‌ను పెళ్లాడిన సివిల్స్‌ టాపర్‌ టీనా దాబి చెల్లెలు.. ఒకరు ఐఏఎస్‌, మరొకరు ఐపీఎస్‌

Who is IPS Manish Kumar Married To IAS Tina Dabi Sister Ria - Sakshi

ఐఏఎస్‌ అధికారి, యూపీఎస్‌సీ టాపర్‌ టీనా దాబి సోదరి ఐఏఎస్‌ రియా దాబి పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఐపీఎస్‌ అధికారి మనీష్‌ కుమార్‌తో ఏడడుగులు వేశారు. కాగా మనిష్‌ కుమార్‌, రియా దాబిలు కుటుంబ సభ్యుల అనుమతితో  ఏప్రిల్‌ నెలలోనే కోర్టు వివాహం చేసుకున్నారు. అంటే వీరి పెళ్లి జరిగి రెండు నెలలు కావొస్తుంది. అయితే మనీష్‌ కుమార్‌ కేడర్‌ను మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మారుస్తూ హోం మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. 

ఇక రియా దాబి ఆమె భర్త ఐపీఎస్‌ మనీష్‌ కుమార్‌ ఇద్దరూ 2020 యూపీఎస్సీ బ్యాచ్‌కు చెందిన వారే. యూపీఎస్సీ పరీక్షల్లో ఆమె 15వ ర్యాంకర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని అల్వార్‌కు కలెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరికి ముస్సోరీలోని శిక్షణా అకాడమీలో పరిచయం ఏర్పడగా.. అనంతరం స్నేహం ప్రేమగా మారింది. అయితే రియా రాజస్థాన్‌ కేడర్‌ కాగా మనీష్‌ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌. వివాహామనంతరం మనీష్‌ తన కేడర్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకొని..మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు మార్చుకున్నారు.
చదవండి: బిల్లు కట్టకుండా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో రెండేళ్లు.. తర్వాత ఏమైందంటే!

కాగా మనీష్‌ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. బీటెక్ చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 2020 పరీక్షలో 581 ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని ఒసామాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇప్పుడు రాజస్థాన్‌కు బదిలీ కానున్నారు. త్వరలోనే వీరు జైపూర్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేసుకోనున్నారు.

కాగా రియా సోదరి టీనా దాబి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 2015 టాపర్‌గా నిలిచారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి దళితురాలిగా రికార్డు సృష్టించింది. సెకండ్‌ ర్యాంకర్‌ అయిన అథర్‌ అమీర్‌ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రెండేళ్లకే 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. గతేడాది ఐఏఎస్‌ ప్రదీప్‌ గావండేను రెండో పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం జైసల్మేర్‌  జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top