కరోనా రోగి ప్రాణం నిలిపిన వలంటీర్లు: సీఎం ప్రశంస

Volunteer Rushed With Covid Patient In Alappuzha, CM Pinarayi Praises - Sakshi

తిరువనంతపురం: ప్రస్తుతం కరోనా విజృంభణ వేళ మానవమూర్తులు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా బాధితులకు అండగా నిలుస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా కేరళలో ఓ ఇద్దరు అత్యంత వేగంగా స్పందించడంతో ఓ కరోనా రోగి ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డాడు. రోగి పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే ఏమీ ఆలోచించకుండా వెంటనే బైక్‌పై అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారు చేసిన పనిని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

కేరళలోని అలప్పూజ జిల్లా పున్నాప్ర ఆరోగ్య కేంద్రంలో అశ్విన్‌ కుంజుమన్‌, రేఖ వలంటీర్లుగా పని చేస్తున్నారు. కరోనా బాధితులకు ఆహారం అందించడం.. వారి అవసరాలు తీర్చడం వంటివి చేస్తున్నారు. శుక్రవారం కరోనా బాధితులకు ఆహారం అందించేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరి ఆరోగ్యం విషమించిందని తెలిసింది. వెంటనే కింది అంతస్తులో ఉన్న రోగి పరిస్థితి చూసి చలించిపోయారు. అంబులెన్స్‌ వారికి ఫోన్‌ చేయగా ఆలస్యమవుతుందని తెలిసింది. దీంతో వెంటనే అశ్విన్‌, రేఖ ఆ రోగిని బైక్‌పై కూర్చోబెట్టుకుని వెంటనే సమీపంలోని పెద్దాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యం మెరుగైంది.

అయితే వారు రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే వారిద్దరూ పీపీఈ కిట్‌ ధరించడంతో వారికి కరోనా సోకే అవకాశమే లేదు. సోషల్‌ మీడియాలో వీరిద్దరు చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభినందించారు. ఆ ఇద్దరు చేసిన పనితోనే ప్రస్తుతం అతడు బతికాడని సీఎం తెలిపారు. ఏమాత్రం సమయం ఆలస్యం చేయకుండా చేసిన వారిద్దరికీ ప్రత్యేక అభినందనలు అని సీఎం పినరయి చెప్పారు.

చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
చదవండి: ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top