నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా..

Viral Video: Woman Attempts Suicide By Jumping Into Jhelum River, Gets Saved By Police	 - Sakshi

శ్రీనగర్:  గుర్తుతెలియని ఒక మహిళ జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలను కుంది. అయితే,  పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె ప్రాణాలను కాపాడారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.  వివరాలు.. ఈ సంఘటన  శ్రీనగర్​లోని జీలం నది వద్ద  సోమవారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఒక మహిళ జీలంనది ఉన్న బుద్షా వంతెన వద్దకు చేరుకుంది.

ఈ క్రమంలో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నదిలో దూకడానికి ప్రయత్నించింది. అయితే, అక్కడ గస్తీలో ఉన్న జమ్ముకశ్మీర్​ పోలీసులు, సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​(సీఆర్​పీఎఫ్​) పోలీసులు ఆమెను పక్కకు లాగి, ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, కరోనా, లాక్​డౌన్​ కారణంగా పనిదొరక్క కుటుంబ సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో, ఆర్థికంగా కూడా ఎంతో కృంగిపోయిన ఆమె చివరకు  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆమెకు నిపుణులతో సరైన కౌన్సిలింగ్​ ఇప్పిస్తామని కశ్మీర్​ పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే, సదరు మహిళ ప్రాణాలను కాపాడిన వీడియో వైరల్​గా మారడంతో నెటిజన్లు పోలీసు అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. ‘ మీరు చేసిన గొప్ప పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top