Viral Video: హీరో లెవల్లో యువకుడి బైక్‌ స్టంట్‌.. ఝలక్‌ ఇచ్చిన పోలీసులు

Viral Video: Police Fines Man After Stunt Performing On Moving Bike - Sakshi

రాయ్‌పూర్‌: బైక్ స్టంట్స్‌, రేసింగ్‌లు చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. పోలీసులు ఇలాంటివి చేయడకూడదని ఎంత చెప్పినా కూడా పట్టించుకొని కొందరు రోడ్డుపై విన్యాసాలు చేస్తూ పాపులర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. వీరు చేసే ఫీట్లు ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అంతేగాక వీటి వల్ల కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయినా స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.  

తాజాగా ఓ బైకర్ చేసిన స్టంట్ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కదులుతున్న బైక్‌ మీద ఓ వ్యక్తి ప్రమాకరంగా స్టంట్‌ చేశాడు. రద్దీగా ఉన్న రోడ్డుపై బైక్‌కు ఒకవైపే కూర్చొని  విన్యాసాలు చేశాడు. ఒంటి చేతితో హ్యండీల్‌ పట్టుకొని  హీరోలా ఫీల్‌ అవుతూ ప్రమాదకరంగా డ్రైవ్‌ చేశాడు. హెల్మెట్‌ కూడా ధరించకుండా రోడ్డు భద్రతా నియమాలను ఏమాత్రం పాటించకుండా బైక్‌ నడిపాడు. అంతేగాక ఆయన చేసే ఘనకార్యాన్నిస్నేహితులతో వీడియో తీయించుకున్నాడు. 
చదవండి: ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన కదిలే కళ్యాణ మండపం.. చూస్తే ‘వావ్‌’ అనాల్సిందే

అయితే యువకుడి స్టంట్‌ ఆయనకే ఎసరు పెట్టింది. బైక్‌తో ఫీట్లు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడికి రూ. 4,200 జరిమానా విధించి చర్యలు తీసుకున్నారు. చివరకు తనను క్షమించాలని చెవులు పట్టుకుని ఆ యువకుడు వేడుకున్నాడు. దుర్గ్‌ పోలీసులు ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇప్పటి వరకు రెండు లక్షల మంది వీక్షించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల చర్యను నెటిజన్లు అభినందిస్తున్నారు. బైకర్‌ తిక్క కుదిరిందంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top