కింగ్‌ చార్లెస్‌ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు

Viral Video: Mumbai Dabbawalas Buy Gifts For King Charles Coronation - Sakshi

సాక్షి, ముంబై: ముంబైలోని డబ్బావాలాల సేవలు గురించి అందరికీ తెలిసిందే. వారు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, స్కూల్‌కి వెళ్లే పిల్లలకు లంచ్‌ బాక్స్‌లు అందిస్తుంటారు. వారికి బ్రిటన్‌ రాజు చార్లెస్‌ పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానం అందడం విశేషం. అందుకోసం అని వారు పుణెగిరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను కొనుగోలు చేశారు. పుణేగిరి పగడి అనేది తలపాగా.

దీన్ని పూణేలో గౌరవ చిహ్నంగానూ, గర్వంగానూ భావిస్తారు. అంతేగాదు ఇక్కడి తలపాగాకి భౌగిళిక హోదా లభించింది కూడా. ఇక్కడి ముంబై డబ్బావాలాలకు బ్రిటీష్‌​ ఎంబసీ ద్వారా ఆహ్వానాలు అందినట్లు మీడియాకి తెలిపారు. ఈ మేరకు ముంబై డబ్బావాలాస్‌ ప్రతినిధి విష్ణు కల్డోక్‌ మాట్లాడుతూ..  తమలోని ఇద్దరు డబ్బావాలాలకు ఆహ్వానం అందిందన్నారు.

అదీగాక బ్రిటీష్‌ రాయల్టీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అతను రాజు కాబోతున్నాడు కాబట్టి కింగ్‌ చార్లెస్‌కి పుణేరి పగడి తోపాటు వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం అని డబ్బావాలా ప్రతినిధి విష్ణు కల్డోక్‌ అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. కాగా, ఈ ముంబైలోని డబ్బావాలాలు నగరంలో లంచ్‌బాక్స్‌ డెలివరీ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు. 

(చదవండి: శరద్‌ పవార్‌ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top