నడి రోడ్డుపై దేశాధ్యక్షుడి పోస్టర్లు

Viral French President Emmanuel Macron Posters On Mumbai Road - Sakshi

ముంబై : గురువారం ముంబైలోని మహమ్మద్‌ అలీ రోడ్డుపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ పోస్టర్లు కలకలం రేపాయి. అలా రోడ్డుపై వందల సంఖ్యలో పోస్టర్లు దర్శనమివ్వటంతో పాదచారులు, వాహనదారులు ఆసక్తిగా వాటిని తిలకించారు. సమాచారం అందుకున్న ఫైధోనీ పోలీసులు రోడ్డు వద్దకు చేరుకుని పోస్టర్లను తీసివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ( నా పిల్లలకు ఈ మాట చెప్పండి..)

కాగా, గురువారం ఫ్రాన్స్‌లోని నైస్‌ సిటీలోని నాట్రిడేమ్‌ చర్చిలో ఓ దుండగుడు కత్తి దాడి జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీనిపై ఇమాన్యుయేల్ స్పందిస్తూ.. దాన్ని మతోన్మాదుల దాడిగా పేర్కొన్నారు. ‘ఇస్లామిక్‌ టెర్రరిస్ట్‌ అటాక్‌’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పోస్టర్లు ముంబైలోని రోడ్డుమీద కనిపించటం చర్చనీయాంశంగా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top