పచ్చని పందిట్లో రభస..కారణం వింటే ఛీ!..అంటారు!

వివాహబంధం అంటేనే రెండు కుటుంబాల కలయిక. అందులోకి మన దేశంలో చాలా అట్టహాసంగా వివాహ వేడుకలు జరుగుతుంటాయి. అలాంటి ఆనందమయ క్షణాలను కొంతమంది అర్థం కానీ రీజన్లతో విషాదమయంగా మారుస్తుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభించే నవదంపతుల సంతోషాన్ని అలాంటి సంఘటనలు ఆవిరి చేసేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో అచ్చం అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
అప్పటి దాక సంతోషంగా ఉన్న పచ్చని పెళ్లిమండపం కాస్త ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. పెద్ద కారణం కూడా ఏం లేదు. కేవలం వరుడు తరుపు మామయ్యకు పన్నీర్ కర్రీ వడ్డించలేదని గొడపడ్డారు. ఆ గొడవ కూడా ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్లు ఒకరి నొకరు దారుణంగా కొట్టుసేకునేంత వరకు వెళ్లిపోయారు. చుట్టపక్కల వాళ్లు ఆపేందుకు యత్నిస్తున్నా.. లెక్కచేయకుండా మూర్ఖంగా పోట్లాడుకొన్నారు. అందుకు సంబంధించిన ఆదియోగి అనే వినియోగదారుడు సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
शादी में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम देख लो....
यूपी के बागपत का है मामला। #Baghpat #Viralvideo #UttarPradesh pic.twitter.com/gh3nMfVKUV
— Aditya Bhardwaj (@ImAdiYogi) February 9, 2023
(చదవండి: జస్ట్ కారు దిగి వచ్చింది..దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..)