వర్షం కోసం గాడిదలకు పెళ్లి | Villagers Organize Donkey Wedding to Pray for Rain | Sakshi
Sakshi News home page

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

Jul 6 2026 10:32 AM | Updated on Jul 6 2026 10:39 AM

Villagers Organize Donkey Wedding to Pray for Rain

వర్షాలు కురవకపోవడంతో బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ  గ్రామస్తులు గాడిదలకు వివాహం జరిపించారు. ఈ తతంగం చాలాచోట్ల జరిగేదే అయినా మున్యాళ గ్రామస్తులు ఒక అడుగు ముందుకేసి వివాహ ఆహ్వానపత్రికలు ముద్రించి పంపిణీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మగ గాడిదకు కాంతేశ్‌ అని, ఆడ గాడిదకు కస్తూరి అని నామకరణం చేసి శాస్తోక్తంగా వివాహం జరిపించారు. పెళ్లికి విచ్చేసిన వారికి  విందు భోజనం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితిలో ఆనాదిగా వస్తున్ప ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించామన్నారు. 

- దొడ్డబళ్లాపుర(కర్ణాటక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement