
న్యూఢిల్లీ: ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ‘వందేభారత్’లో ప్రయాణించాలని పలువురు భావిస్తుంటారు. అయితే ఈ రైలు అధునాతనమైనది కావడంతో కొందరు ప్రయాణికులు గందరగోళానికి గురవుతుంటారు. ఇటువంటి ఉదంతమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని @AiSenpaiyt అనే రెడిట్ యూజర్ 'r/IndianRailways' ఫోరమ్‌లో వివరించారు. ఈ పోస్టును చూసినవారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తాను కూర్చున్న విండో సీటును అడిగేందుకు ఒక మహిళ అనారోగ్యాన్ని సాకుగా చూపిందని, దానిని తాను ఎలా తిరస్కరించాననేది ఆయన ఆ పోస్టులో తెలిపారు. ఆ రెడిట్ యూజర్ తాను రిజర్వు చేసుకున్న విండో సీటులో హాయిగా కూర్చున్నారు.
రెండు స్టాప్‌ల తరువాత 40 ఏళ్ల ఒక మహిళ అతని పక్క సీటులో కూర్చుంది. రెండు పెద్ద బ్యాగులు కూడా ఆమె దగ్గరున్నాయి. ఆమె మర్యాదపూర్వకంగా నవ్వుతూ పలుకరించింది. కిటికీలోంచి బయటకు చూసేందుకు కొద్దిగా ముందుకు వంగింది. తరువాత ఈ సీటు తనకు కావాలని, కడుపులో వికారంగా ఉందని తెలిపింది. అయితే అతను క్షమాపణలు కోరుతూ, ఆ సీటు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆమె తనకు కేటాయించిన సీటులోనే కూలబడింది. వందేభారత్ రైలులో విండో సీటు తెరుచుకోదని తెలియని ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని ఆ రెడిట్ యూజర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి