Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Evening Headlines 24th June 2022 | Sakshi
Sakshi News home page

Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Jun 24 2022 5:07 PM | Updated on Jun 24 2022 5:26 PM

Top10 Telugu Latest News Evening Headlines 24th June 2022 - Sakshi

1. AP Cabinet Meeting: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీ ముగిసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. చింతామణి నాటకం నిషేధంపై స్టేకు నిరాకరించిన ఏపీ హైకోర్టు


చింతామణి నాటక నిషేదంపై స్టే ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. నాటకాన్ని నిషేదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్‌ దాఖలు చేశారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఏక్‌నాథ్ షిండేపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే


మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలై రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం పరిణామాలు ఎలా ఉన్నా అంతిమ విజయం కోసం నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన నేతలతో శుక్రవారం భేటీ అయ్యారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పాకిస్తాన్‌లో పేపర్‌ సంక్షోభం...వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి పుస్తకాలు ఉండవు!


పాకిస్తాన్‌లో లోపభూయిష్టమైన విధానాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల రీత్యా తీవ్రమైన పేపర్‌ సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని పాకిస్థాన్ పేపర్‌ అసోసియేషన్‌ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రైల్వే స్టేషన్‌ ఘటన: సాయి డిఫెన్స్‌ అకాడమీదే కీలక పాత్ర!


గత వారం జరిగిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ కీలక పాత్ర పోషించింది. మొత్తం కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ సాయి డిఫెన్స్‌ అకాడమీ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అల్లర్ల ఘటనకు ముందు రోజు ఇన్‌స్టిట్యూట్‌లోనే మకాం వేసి పథకం రచించారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. టేక్‌ హోం సాలరీ, పనిగంటలు: జూలై 1 నుంచి మార్పులు 


కేంద్రం ప్రభుత్వం జూలై 1నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. ఈ కొత్త కార్మిక చ‌ట్టాలు అమలుతో కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి, వేతనాలలో గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Ram Gopal Varma: ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్‌, భగ్గుమన్న బీజేపీ


తరచూ వివాదాల్లో నానుతూ ఉండే రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడు. 'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరవుతారు?
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం: ఏపీ కేబినెట్‌ ఆమోదం


మహిళా స్టార్‌ ఆర్చర్‌, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్‌-1 డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Lionel Messi: చిన్న వయసులోనే వింత రోగం.. ఫుట్‌బాల్ ఆడొద్దన్నారు; కట్‌చేస్తే


ప్రస్తుత ఫుట్‌బాల్‌ అనగానే గుర్తుకువచ్చేది ఇద్దరు. ఒకరు అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ.. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో. సమకాలీనంలో ఈ ఇద్దరు ఎవరికి వారే గొప్ప ఆటగాళ్లు. ఇద్దరిలో ఎవరు గ్రేటెస్ట్‌ ఆల్‌ ఆఫ్‌ టైమ్‌(GOAT) అని అడిగితే మాత్రం చెప్పడం కాస్త కష్టమే.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Hyderabad: అబిడ్స్‌ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత


అబిడ్స్‌ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఇంకా జరగలేదు. ఇదే విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్‌డౌన్‌, టెక్నికల్‌ ప్రాబ్లమని చెబుతున్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement