Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌ | Top 10 Telugu Latest News Evening Headlines Today 2nd May 2022 | Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

May 2 2022 5:00 PM | Updated on May 2 2022 5:16 PM

Top 10 Telugu Latest News Evening Headlines Today 2nd May 2022 - Sakshi

1.. తిడతావా? తిట్టు.. నేనేం పుతిన్‌లా కాదు: బైడెన్‌ వెటకారం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెటకారం ప్రదర్శించాడు. తనను విమర్శించినా పర్వాలేదని అంటూనే.. తానేం పుతిన్‌లా నియంతను కాదంటూ సూటి వ్యాఖ్యలు చేశాడు. 
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Three Nation Visit To Europe: జర్మనీలో మోదీకి ఘనస్వాగతం...
 ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌లో తన మూడు దేశల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3..తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్‌ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?
ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యాట్రిమోనియల్‌ సైట్‌ల ద్వారా తమ పిల్లలకు తగిన సంబంధాలను వెతుకుతున్నారు. అదేవిధంగా మ్యాటిమోని సైట్ల ద్వారా మోసపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఏంటి ఇదంతా అనుకోకండి ఇక్కడొక తండ్రి ఎంతో ఆశతో తన కూతురుకి సరిపోయే వరుడి వివరాలు పంపిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా?
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4 ..వివాహేతర సంబంధాలు’! బీజేపీ నేత శ్వేత మృతి కేసులో సంచలన విషయాలు
బీజేపీ నేత శ్వేతా సింగ్‌ గౌర్‌ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన నీచపు బాగోతం బయటపెడుతుందనే ఉద్దేశంతోనే ఆమె భర్తే ఆమెను హత్య చేసి.. అత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడంటూ ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే శ్వేత భర్తను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ​​​​​​
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచారం బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6..Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్‌ మల్లన్న గుడ్‌బై?
చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న బీజేపీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. పార్టీలో ఆశించిన మేర ప్రాధాన్యత లభించని కారణంగానే మల్లన్న బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన అనుయాయులు చెబుతున్నారు. 
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7..Vishwak Sen: అభ్యంతరక పదంతో యాంకర్‌పై విశ్వక్‌ సేన్‌ ఫైర్‌
సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలా ప్రాంక్‌ వీడియోలు చేయడం ఏంటని, హీరో మెంటల్‌ స్టేటస్‌పై ప్రశ్నించింది యాంకర్‌. ఈ నేపథ్యంలో విశ్వక్‌ను డిప్రెషన్‌ పర్సన్‌, పాగల్‌ శ్రీను వంటి పదాలు వాడారు. దీంతో విశ్వక్‌ యాంకర్‌పై ఫైర్‌ అయ్యాడు.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8..IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కీలక ఆటగాడు దూరం..!
వరుస ఓటముల బాధలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌ తగిలింది. సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే!
చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు,  కరోనా (చైనాను మినహాఇస్తే) తగ‍్గడంతో ఇన్నిరోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇంటికే పరిమితమైన ఉద్యోగులు.. ఇప్పుడు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. పై అంశాలనే ప్రస్తావిస్తూ హర్ష్‌ గోయాంక్‌ సరదా ట్వీట్‌ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
​​​​​​​👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10..  కొవ్వులు తక్కువ.. బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది చాలా మంచిది!
కర్బూజాలో శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు, పుష్కలంగా నీరు ఉంటాయి. వేసవిలో దీనితో తయారు చేసే మస్క్‌ మిలాన్‌ మొజిటో తాగిన వెంటనే పొట్టనిండిన భావన కలిగి దాహం తీరి ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
​​​​​​​👉పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

​​​​​​​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement