Attack On Taneti Vanitha: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచారం బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అద్దాలు పగులగొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంమంత్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.
చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం
17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు
కాన్వాయ్‌పై దాడి ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.