ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె. సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవార్డుకి ఎంపిక చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకోనున్నారు.