Andhra Pradesh: లోన్‌యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్

సాక్షి, తాడేపల్లి: లోన్ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే, బుధవారం రోజున రుణ యాప్ వలలో పడి రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరి చిన్నారులు నాగసాయి (4), లిఖిత శ్రీ(2)లు అనాధలుగా మిగిలారు. అయితే ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులు ఇద్దరికి చెరో రూ.5లక్షల సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలతకి ఆదేశాలిచ్చారు.
చదవండి: (న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య)
సంబంధిత వార్తలు