Jammu: రాజౌరిలో ఉగ్రకుట్ర భగ్నం | Soldier Injured After Terror Attack On Indian Army Picket In Jammu And Kashmir Rajouri | Sakshi
Sakshi News home page

Jammu: రాజౌరిలో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు

Jul 22 2024 8:57 AM | Updated on Jul 22 2024 10:25 AM

Terror Attack on Army Picket Rajouri

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసేందుకు తాజాగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ పోస్ట్ రాజౌరిలోని గుండా ఖవాస్ ప్రాంతంలో ఉంది.

జమ్ము ప్రాంతంలో గత కొన్ని నెలలుగా తీవ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడుల వెనుక పాక్‌ హస్తం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో చొరబాటు ఘటనలు కూడా పెరిగాయి. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా సంస్థలు  ముమ్మరంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తాజాగా అత్యున్నత స్థాయి సంయుక్త భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చేవారిని అంతమొందించేందుకు అన్ని ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలన్నారు. చొరబాట్లను నిరోధించేందుకు భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సిన్హా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement