బద్రీనాథ్‌ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది మృతి? | 8 People Killed And Many Injured After Tempo Traveller Fell Into Alaknanda River, See Details | Sakshi
Sakshi News home page

బద్రీనాథ్‌ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది మృతి?

Published Sat, Jun 15 2024 2:13 PM | Last Updated on Sat, Jun 15 2024 2:41 PM

Tempo Traveller Fell into Alaknanda River

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలకనంద నదిలో ఒక టెంపో వాహనం పడిపోయింది. ఈ టెంపోలో  25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, వారిలో 10 మంది వరకూ మృతి చెందివుంటారని సమాచారం.

రుద్రప్రయాగ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేపై రతౌలీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్తులు పోలీసులు, పరిపాలనా అధికారులు, డీడీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టెంపో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి, హెలికాప్టర్ ద్వారా గుప్తకాశీలోని ఆస్పత్రికి తరలించారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, పరిపాలనా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఒక ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు.  క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేలితే అతనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement