కలెక్టర్‌ ప్రశంసలందుకున్న తెలుగు విద్యార్థి | Telugu Student Appreciated By Collector Albizan Varghese Tamil Nadu | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ప్రశంసలందుకున్న తెలుగు విద్యార్థి

Dec 18 2021 8:27 AM | Updated on Dec 18 2021 12:29 PM

Telugu Student Appreciated By Collector Albizan Varghese Tamil Nadu - Sakshi

తిరువళ్లూరు: తెలుగు మీడియం విద్యార్థి తిరుక్కురల్‌ను అనర్గళంగా చెప్పి కలెక్టర్‌తో శభాష్‌ అనిపించుకున్నాడు. తిరువళ్లూరు కలెక్టరేట్‌లో శిరగుగల్‌ (రెక్కలు)–100  పేరిట శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 100 మంది ఎస్టీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించాలని కోరారు.

నొచ్చిలి ప్రభుత్వ పాఠశాల తెలుగు మీడియం విద్యార్థి వెంకటేషన్‌ దాదాపు 5 నిమిషాల పాటు తిరుక్కురల్‌ను ఒప్పించాడు. కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీస్‌ విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్నారు. వెంటనే విద్యార్థి జోక్యం చేసుకుని.. సార్‌ నేను తెలుగు మీడయం విద్యార్థి, అయినా తిరుక్కురల్‌పై ఆసక్తితో నేర్చుకున్నానని తెలిపాడు. దీంతో కలెక్టర్‌ శభాష్‌ అంటూ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement