మావోయిస్టుల్లో కలవరం..వంద మందికి పైగా కరోనా

Telangana Police Urge Maoists Surrender For Covid Treatment - Sakshi

గ్రామస్తుల రూపంలో వ్యాక్సిన్‌ కోసం క్యూల్లో మావోలు

తెలంగాణ నుంచి సానుభూతి పరులతో మాత్రల సేకరణ

కొరియర్లు, ప్రజాకోర్టుల ద్వారా కరోనా పాకిందని అనుమానం

ఇప్పటికే పదిమంది మృతి, 100 మందికిపైగా పాజిటివ్‌

అనారోగ్యం, ప్రతికూల వాతావరణంతో పరిస్థితి దయనీయం

సాక్షి, హైదరాబాద్‌: అసలే ఎండాకాలం.. పైగా అది అడవి.. దాహార్తి తీర్చుకోవడమే గగనం.. మరోవైపు బీపీ, షుగర్, ఆస్తమా.. వీటికితోడు ఇప్పుడు కరోనా, లాక్‌డౌన్‌.. కొరియర్లు కలవలేకపోతున్నారు.. మందులు అందడంలేదు.. వెరసి దయనీయస్థితిలో మావోయిస్టులు. కనిపించే శత్రువుపైకి కాలుదువ్వే మావోయిస్టులు ఇప్పుడు కనిపించని శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పుడు రూటు మార్చి మందుల కోసం వేట మొదలుపెట్టారు. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మావోలకు కొత్తకష్టం వచ్చి పడింది. కరోనా వైరస్‌ రూపంలో వారు ఇప్పుడు కొత్త శత్రువుతో పోరాటం చేస్తున్నారు. మొదటి కరోనా వేవ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నారు. కానీ, సెకండ్‌వేవ్‌తో విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే 100 మందికిపైగా మావోయిస్టులు కరోనా బారిన పడ్డారని సమాచారం. అందులో పదిమంది వరకు మృతి చెందారు.

కొరియర్లు, ప్రజాకోర్టులు.. 
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మావోయిస్టులు ఏప్రిల్‌ 26న భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పలుమార్లు బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పలు ఆదివాసీ గ్రామాల్లో వేలాదిమందితో సభలు, సమావేశాలు నిర్వహించారు. వందల సంఖ్యలో దళాల సభ్యులు, అగ్రనేతలు పాల్గొన్నారు. అక్కడక్కడా ప్రజాకోర్టులు నిర్వహించేవారు. తరచూ కొరియర్లు వచ్చి కలిసేవారు. ఈ కారణాల వల్ల దళాల సభ్యులకు వైరస్‌ పాకిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు పారాసిటమాల్‌ మాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారిలో కరోనా లక్షణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, అదే మరణాలకు దారితీస్తోందని పోలీసులు తెలిపారు. అందుకే, తెలంగాణలోకి తమ కొరియర్లను పంపి కరోనా మాత్రలను సమకూర్చుకోవడం, వయసు మీద పడిన మావోయిస్టు నేతలను సాధారణ గ్రామస్థుల రూపంలో తీసుకువచ్చి వ్యాక్సిన్‌ వేయించడంపై వారు దృష్టి పెట్టారని నిఘావర్గాలు గుర్తించాయి.

మరణాలకు కారణాలు ఇవే..! 

  • దండకారణ్యంలో సంచరించే మావోల్లో వ్యాపిస్తున్న స్ట్రెయిన్‌ చాలా ప్రమాదకరమైనదని సమాచారం. అయితే అది ఏంటన్నది ఇంతవరకూ గుర్తించలేదు. 
  • ఆస్తమా, బీపీ, షుగర్, గుండెజబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న మావోయిస్టులలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. 
  • మహారాష్ట్ర, తెలంగాణలో లాక్‌డౌన్‌ కారణంగా కొరియర్లు, సానుభూతిపరుల కదలికలు కష్టమవడంతో వారి నుంచి మందులు సకాలంలో అందడంలేదు. 
  • కొందరికి మాత్రలతో వ్యాధి అదుపులోకి రాక ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. 
  • వేసవి కావడంతో అడవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. డెంగీ, మలేరియా లక్షణాలకు కరోనా లక్షణాలకు పెద్దగా తేడా లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. 

ర్యాంకుల ఆధారంగా మందులు 
ప్రస్తుతం మావోయిస్టుల దళాల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. వారికోసం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మందుల సేకరణ జరుగుతున్నట్లు మాకు కూడా సమాచారం ఉంది. ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల ఆ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. గ్రామాల్లోకి మావోలు సాధారణ ప్రజల రూపంలో వచ్చి వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కేడర్‌లోని ర్యాంకులను బట్టే వ్యాక్సిన్లు వేయస్తున్నారు, మందులు సరఫరా చేస్తున్నారు. ఇటీవల భారత్‌బంద్‌ నేపథ్యంలో వారు వేలాదిమందిని సమీకరించి ఏర్పాటు చేసిన సమావేశాల అనంతరం దళాల్లో వైరస్‌ తీవ్రత పెరిగింది. కరోనా పాజిటివ్‌ ఉన్న సభ్యులెవరైనా లొంగిపోతే, వారికి ఎలాంటి హానీ తలపెట్టం. కావాల్సిన చికిత్స అందజేస్తాం.
–అభిషేక్‌ ఎస్పీ, దంతెవాడ

(చదవండి: ‘సిటీమార్‌’ స్టెప్పులతో డాక్టర్ల డ్యాన్స్‌.. దిశా పటాని కామెంట్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-05-2021
May 17, 2021, 10:38 IST
సాక్షి, ఖమ్మం: కరోనా సోకిన వారు అనవసర ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడడం ద్వారా...
17-05-2021
May 17, 2021, 09:27 IST
హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా...
17-05-2021
May 17, 2021, 09:13 IST
నల్లగొండటౌన్‌ : కరోనా వైరస్‌ మరింత శక్తివంతంగా మారుతోంది. మొదటి దశలో కంటే రెండో దశలో కేసులతో పాటు మరణాల...
17-05-2021
May 17, 2021, 08:43 IST
గీసుకొండ : గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారానికి చెందిన హమాలీ కార్మికుడు దొండ అనిల్‌యాదవ్‌కు వారం రోజుల క్రితం...
17-05-2021
May 17, 2021, 08:00 IST
ఆ సంఖ్య మారలేదు. అలాగే ఉంది. దాంట్లో ఎలాంటి మార్పుచేర్పుల్లేవు. ఏదో ఒక్కరోజు మాత్రమే  తెలపాలనుకున్నప్పుడు  వెబ్‌సైట్‌లో ఎందుకు ..?...
17-05-2021
May 17, 2021, 06:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. ఇంకా రోజుకు మూడు లక్షలకు పైనే కేసులు వస్తున్నప్పటికీ... మొత్తం మీద చూస్తే...
17-05-2021
May 17, 2021, 06:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం...
17-05-2021
May 17, 2021, 05:37 IST
అమలాపురం టౌన్‌: వారిద్దరూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కుర్రాళ్లు. కష్టపడి ఉన్నత శిఖరాలను ఆధిరోహించిన యువ కిశోరాలు. ఒకరు...
17-05-2021
May 17, 2021, 04:40 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ మరణాలను ప్రపంచ దేశాలు తక్కువగా చూపిస్తున్నాయంటోంది యూనివర్సిటీ ఆఫ్‌ అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌...
17-05-2021
May 17, 2021, 04:34 IST
లక్ష్మీపురం(గుంటూరు): గుజరాత్‌ జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ ఆవరణలోని కాంకర్‌...
17-05-2021
May 17, 2021, 04:29 IST
మచిలీపట్నం:  కోవిడ్‌ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా,...
17-05-2021
May 17, 2021, 04:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ కరోనా నియంత్రణ కోసం 2,229 కోట్ల పైచిలుకు వ్యయమైంది....
17-05-2021
May 17, 2021, 04:12 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు కాంగ్రెస్‌ అభయ‘హస్తం’అందించనుంది. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులకు అండగా ఉండాలని...
17-05-2021
May 17, 2021, 04:01 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరికలకు నిర్వహించాల్సిన  ప్రవేశ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయా? లేదా?...
17-05-2021
May 17, 2021, 03:29 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్కడ మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే. కరోనా రోగి కదా అన్న కరుణాలేదు.. చేసిందే చికిత్స.....
17-05-2021
May 17, 2021, 03:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు మీదికి బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని పోలీసులు ఆపగా ‘మా పక్క వీధిలో అంకుల్‌కు కరోనా...
17-05-2021
May 17, 2021, 02:34 IST
న్యూఢిల్లీ: డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ సోమవారం విడుదల కానుంది. నోటి ద్వారా తీసుకునే...
17-05-2021
May 17, 2021, 02:34 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను పంపిణీ...
17-05-2021
May 17, 2021, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంలో పడింది. శని, ఆదివారాల్లో టీకాల పంపిణీని నిలిపివేస్తున్నామని.. తిరిగి సోమవారం...
17-05-2021
May 17, 2021, 00:47 IST
ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల ఘోర దుస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కాకపోవచ్చు. కానీ ఉన్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top