
న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు పార్లమెంట్ కమిటీతో సమావేశం కావడానికి అకస్మాత్తుగా తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిజీపీతో పాటు ఏడిజి జితేందర్, ఏడిజి సంజయ్ జైన్ కూడా వెళ్లారు. పార్లమెంట్ కమిటీ ముందు తెలంగాణ పోలీస్ శాఖ పని తీరును వివరించారు. అందులో పోలీస్ శాఖ ప్రవేశ పెడుతున్న సంస్కరణలు, అమలు చేస్తున్న విధానాలు, టెక్నాలజీ, మావోయిస్టు సమస్య, వర్టీకల్ (పని విభజన) పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిజీపీ వివరించారు. ఈ క్రమంలో అన్ని అంశాలపై నివేదికను పార్లమెంట్ కమిటీకి సమర్పించారు.