ఆస్తులు లాగేసుకుని బయటకు గెంటేశారు | Tamilnadu: Father Complaint To Collector On Son On Assests Issue | Sakshi
Sakshi News home page

ఆస్తులు లాగేసుకుని బయటకు గెంటేశారు

Aug 24 2021 9:20 AM | Updated on Aug 24 2021 12:50 PM

Tamilnadu: Father Complaint To Collector On Son On Assests Issue - Sakshi

సాక్షి,తిరువళ్లూరు(చెన్నై): ఆస్తులను లాగేసుకుని కుమారులు ఇంటి నుంచి బయటకు గెంటేశారని.. తనకు న్యాయం చేయాలని విశ్రాంత హెచ్‌ఎం కలెక్టర్‌ ఎదుట విలపించాడు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి తాలుకా చెన్నీర్‌కుప్పం గ్రామానికి చెందిన పరశురామన్‌కు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రెండేళ్ల క్రితం మృతి చెందారు. పరశురామన్‌కు చెన్నీర్‌కుప్పంలో సుమారు రూ.6 కోట్ల విలువైన 30 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని కొడుకులు తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకుని తండ్రిని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో పరశురామన్‌ సోమవారం కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. స్పందించిన కలెక్టర్‌ పూర్తి విచారణకు ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement