Udhayanidhi Stalin: స్టాలిన్‌ వారసుడు ఇక మంత్రిగా.. | Tamil Nadu: Udhayanidhi Stalin all set to become Minister | Sakshi
Sakshi News home page

తమిళనాడు మంత్రి వర్గంలోకి స్టాలిన్‌ వారసుడు.. ముహూర్తం ఎప్పుడంటే..

Dec 13 2022 7:10 AM | Updated on Dec 13 2022 7:19 AM

Tamil Nadu: Udhayanidhi Stalin all set to become Minister - Sakshi

సినీ నటుడు, నిర్మాత ఉదయ్‌నిధి స్టాలిన్‌ తమిళనాడు మంత్రి కాబోతున్నారు.. 

చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, అధికార డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి(45)కి త్వరలో∙మంత్రి యోగం దక్కనుంది. 14న రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఉదయనిధి మంత్రిగా ప్రమాణం చేయనున్నారని సోమవారం రాజ్‌భవన్‌ తెలిపింది. 

మంత్రివర్గంలోకి ఉదయనిధిని తీసుకోవాలంటూ డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పంపిన సిఫారసును గవర్నర్‌ రవి ఆమోదించారని పేర్కొంది. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో చెపాక్‌–తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

ఉదయనిధికి మంత్రి పదవి కట్టబెట్టాలనే డిమాండ్‌ పార్టీ వర్గాలతోపాటు మంత్రుల నుంచి ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోందని డీఎంకే నేతలు అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement