తమిళనాడులో ఆంధ్రా ఆర్టీసీ బస్సు సీజ్‌

Tamil Nadu Officers Seized Apsrtc Bus In Vellore - Sakshi

వేలూరు( చెన్నై): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును తమిళనాడు అధికారులు గురువారం సీజ్‌ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన సుబ్రమణ్యం నాయుడు(57). ఇతను తన రోజువారీ వ్యాపారాన్ని పూర్తి చేసుకొని 2010 డిసెంబర్‌ 17వ తేదీన గుడియాత్తం నుంచి ఆంబూరుకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. గుడియాత్తం బస్టాండ్‌ సమీపంలోకి బస్సు వస్తుండగా డ్రైవర్‌ ఉన్న ఫలంగా బ్రేక్‌ వేయడంతో ముందు ఉన్న సీటు కమ్మీ తల తగిలి అతడు అక్కడిక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించిన కేసులో 2019 ఆగస్టు 7న వానియంబాడి కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో న్యాయమూర్తి ఆంధ్ర రాష్ట్ర ఆర్టీసీ బస్సు యాజమాన్యం రూ. 15 లక్షలు బాధిత కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని  తీర్పు ఇచ్చింది. అయితే ఎటువంటి నష్ట పరిహారం చెల్లించక పోవడంతో సుబ్రమణ్యం నాయుడు కుమారుడు దనకుమార్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో  సదరు ఆంధ్రా ఆర్టీసీ బస్సును జప్తు చేయాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో బుధవారం రాత్రి వానియంబాడికి వచ్చిన ఆంధ్ర ప్రభుత్వ బస్సును కోర్టు సిబ్బంది సీజ్‌ చేశారు.

చదవండి: ఎంత కష్టం.. 40 ఏళ్లు వచ్చినా పిల్ల కరువాయే!.. పెళ్లి లేదాయే! ఛలో బీహార్‌, యూపీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top