42 ఏళ్ల క్రితం చెన్నైలో చోరీ.. లండన్‌లో దొరికాయి!

Tamil Nadu: Ancient Temple Recovers Stolen Idols After 42 Years - Sakshi

చెన్నై: 42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరాయి. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని నాగపట్నం జిల్లా అనంతమంగళంలో ఉన్న పురాతన రాజగోపాల స్వామి ఆలయంలో 42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లండన్‌లో స్వాధీనం చేసుకున్న ఈ  విగ్రహాలు చెన్నై నుంచి శనివారం ఆలయానికి చేరుకున్నాయి. 1978లో, 15 వ శతాబ్దపు ఈ ఆలయానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుడి విగ్రహాలు దొంగిలించబడ్డాయి. ఆ రోజుల్లో పోరయార్ పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే విగ్రహాలను గుర్తించలేకపోయారు.    (శశికళ ఆశలు అడియాశలు..!)

కాగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో కళాఖండాల వ్యాపారాన్ని పర్యవేక్షించే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన సమాచారం మేరకు దొంగిలించబడిన నాలుగు విగ్రహాలలో మూడు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌లోని ఒక పురాతన వస్తువులను సేకరించే వ్యక్తి వద్ద నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా... శుక్రవారం ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నైలోని విగ్రహాలను పరిశీలించి.. వాటిని అధికారికంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి శంకరేశ్వరికి అప్పగించారు.   (50 అడుగుల బావిలో గున్న ఏనుగు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top