పరీక్షలు రాయకుండానే ప్రమోట్‌ అవుతారా?

Supreme Court Rejects MD Students Plea To Postpone Final Year Exams - Sakshi

న్యూఢిల్లీ: మెడిసిన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ చివరి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని, లేదా వాయిదా వేయాలని మెడికల్‌ యూనివర్సిటీలను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పరీక్షలకు హాజరు కావాల్సిన వైద్య విద్యార్థులు కోవిడ్‌–19 విధుల్లో నిమగ్నమై ఉన్నందున పరీక్షలను రద్దు చేయడమో లేదా వాయిదా వేయడమో చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

ఈ విషయంలో మెడికల్‌ యూనివర్సిటీలకు ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. పరీక్షలు రాయకుండానే వైద్యులు ప్రమోట్‌ అయ్యేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. పీజీ ఆఖరి ఏడాది పరీక్షల తేదీలను ప్రకటించేటప్పుడు కరోనా పరిస్థితిని సైతం పరిగణనలోకి తీసుకోవాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) ఏప్రిల్‌లోనే అన్ని వర్సిటీలకు ఆదేశాలిచ్చిందని తెలిపింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగినంత సమయం ఇచ్చేలా ఎన్‌ఎంసీని ఆదేశించాలంటూ న్యాయవాది సంజయ్‌ హెగ్డే వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.  

చదవండి: కర్ణాటకలో లాక్‌డౌన్‌ సడలింపు.. ఎప్పటివరకంటే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top