పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి .. అబార్షన్‌కు హైకోర్టు నో.. ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

Supreme Court Passed Interim Order To Allow An Unmarried Woman To Abort 24 Weeks Pregnancy - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అబార్షన్‌కు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి కాని యువతి 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అబార్షన్ చేసినా ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని ఢిల్లీ ఎయిమ్స్‌ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు  చెప్పడంతో ఇందుకు ఓకే చెప్పింది.

పెళ్లికానందు వల్ల ఈ యువతి అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం అలాంటి పరిమితులు ఏమీ లేవని చెప్పింది. 2021లో సవరించిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రస్తావించింది. పెళ్లికాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అబార్షన్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ యువతి వయసు 25 ఏళ్లు. కొంత కాలంగా ఒకరితో రిలేషన్‌లో ఉంది. ఈ క్రమంలోనే అవాంఛిత గర్భందాల్చింది. దీంతో అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దిల్లీ హైకోర్టు ఇందుకు నిరాకరించినా.. సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది.
చదవండి: బీజేపీ నేతలకు మమత వార్నింగ్‌.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్‌ బెంగాల్ టైగర్ ఉంది’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top