
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి, పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ఎక్స్ ద్వారా వెల్లడించారు.
‘శిరోమణి అకాలీదళ్ అధక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నేడు పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించారని, పార్టీకి కొత్త అధ్యక్షుడిని అందించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇన్నాళ్లు తన నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు, తనకు మద్దతు, సహాకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు అకాలీదళ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ భుందార్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ జరగనుం. కాగా అకాలీదళ్ అధ్యక్ష పదవి, ఆఫీస్ బేరర్లు, కార్యవర్గానికి డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి.