కోర్టుకు బ్లాక్ డ్రెస్‌లో రావా బేబీ.. వెలుగులోకి సుఖేష్ మెసేజ్‌లు | Sakshi
Sakshi News home page

కోర్టుకు బ్లాక్ డ్రెస్‌లో రావా బేబీ.. వెలుగులోకి సుఖేష్ మెసేజ్‌లు

Published Tue, Dec 26 2023 5:13 PM

Sukesh Hurt When Jacqueline Didnt Wear Black In Court Reveals Chat - Sakshi

ఢిల్లీ:రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జాక్వెలిన్‌కు సుఖేష్ పంపించిన మెసేజ్‌లు కీలకంగా మారాయి. కోర్టులో విచారణ సందర్భంగా జాక్వెలిన్‌ను బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించాలని జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్.. జాక్వెలిన్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. 

2023 జూన్ 30న జాక్వెలిన్‌కు సుఖేష్ మెసేజ్ చేశాడు.'బేబీ వచ్చే 6వ తేదీ కోర్టులో విచారణ ఉంటుంది. హాజరైతే దయచేసి నల్ల కుర్తా ధరించు. తద్వారా నా మెసేజ్‌లన్నీ చూస్తున్నావని, నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకుంటా. మిస్సింగ్ యూ.. ఐ లవ్ యూ బేబీ గర్ల్. నువ్వు ఎప్పటికీ నా దానివే' అని సుఖేష్ రాసుకొచ్చాడు.

'తాజా ట్రోల్‌లతో కలత చెందుతున్నావని నాకు తెలుసు. కానీ బాధపడకు. ఇవేవీ పెద్దవి కావు. నువ్వు నా యువరాణివి. సూపర్ స్టార్ అవుతావు.' అని పేర్కొన్న సుఖేష్.. జాక్వెలిన్ బ్లాక్ డ్రెస్ ధరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా మెసేజ్ చేశాడు. 'బేబీ, కోర్టులో విచారణ సందర్భంగా బ్లాక్ డ్రెస్ ధరించకపోవడం చాలా బాధ కలిగించింది. ఏమి ఆలోచిస్తున్నావో నాకు నిజంగా అర్థం కాలేదు. ఏ విధంగానైనా సహాయం చేస్తానంటే నీకు తోడుగా ఉంటా. నీకు అవసరాలను ఎటువంటి సమస్యలు లేకుండా తీర్చడానికి సిద్ధంగా ఉన్నా.' అని సుఖేష్ మెసేజ్ చేశాడు. అంతేకాకుండా దర్శకుడు, సంగీత రచయిత లవ్ రంజన్ ఒక సినిమా కోసం జాక్వెలిన్‌ను కలుస్తారని పేర్కొన్నాడు.

కాగా.. ఈ కేసులో ఫెర్నాండెజ్‌ పాత్ర ఉందని సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు చేశాడు. దీంతో సుఖేష్‌పై ఫెర్నాండేజ్ తిరగబడ్డారు. సుఖేష్ బెదిరింపుల నుండి రక్షణ కోరుతూ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సుకేష్ చంద్రశేఖర్ లక్షిత దాడిలో తాను అమాయకురాలినని, తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. 

ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక?

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement