అఫ్గాన్‌ గగనతలం మీదుగా విమాన రాకపోకలు రద్దు

Sudden closure of Kabul airport throws schedules of remaining flights into disarray - Sakshi

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ‘అఫ్గాన్‌ గగనతలం అనియంత్రితం’ అంటూ కాబూల్‌ విమానాశ్రయం అధికారులు ప్రకటించారు. అఫ్గాన్‌ గగనతలం ఆర్మీకి బదిలీ అయిందనీ, ఇతర ఏ విమానాలు ప్రయాణించినా దానిని అనియంత్రితంగానే పరిగణిస్తామంటూ కాబూల్‌ ఎయిర్‌పోర్టు అధికారులు నోటమ్‌ (పైలట్లకు హెచ్చరిక నోటీస్‌) విడుదల చేశారు. తదుపరి ప్రకటన చేసే వరకు ప్రజా ప్రయాణాలకు కాబూల్‌ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో అనేక దేశాలు ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఎయిర్‌ ఇండియా, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఇతర సంస్థలు పాశ్చాత్య దేశాలకు తమ విమానాలను ఇతర మార్గాల ద్వారా నడిపాయి. ఎయిర్‌ ఇండియా తన ఏకైక ఢిల్లీ–కాబూల్‌–ఢిల్లీ సర్వీసును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top