కుక్కలు పగబట్టాయా?.. పార్క్‌లో మహిళను వెంబడించి..

Stray Dogs Attack Woman And Her Pet In Noida Viral Video - Sakshi

నోయిడా: కొద్దిరోజులుగా కుక్కల దాడితో గాయపడుతున్న, మృతిచెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ఏదో ఒక చోట కుక్కల దాడుల కారణంగా ఎవరో ఒకరు గాయపడుతూనే ఉన్నారు. ఇక, ఇటీవల యూపీలోని గుర్గావ్‌లో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న వ్యక్తిపై కుక్కల గుంపు దాడి చేసిన ఘటనలో అతను మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటన మరువక ముందే తాజాగా నోయిడాలో ఓ మహిళపై శునకాలు దాడి చేశాయి. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్-78లోని మహాగున్ మోడరన్ సొసైటీలోని ఓ పార్కులో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో నడుచుకుంటూ వెళుతున్నది. ఈ సందర్భంగా మహిళపై కొన్ని వీధికుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. దీంతో, కుక్కల బారినుండి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా అవి వెంటపడ్డాయి. కుక్కల గుంపు నుండి తన కుక్కను, తనను తాను రక్షించుకునేందుకు ఆమె పరుగు తీసింది. ఈ క్రమంలో కుక్కల దాడిలో ఆమెకు స్వల్ప గాయలయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top