'తిక్క కుదిరింది.. ఇలా కావాల్సిందే'

Watch Video How Dog Bites When Young Women Doing Tiktok  - Sakshi

టిక్‌టాక్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాత్రికి రాత్రే స్టార్‌ అవ్వాలనే తాపత్రయంతో రోడ్లు, పార్కులు ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేసేస్తున్నారు. ఈ సందర్భంలో కొన్నిసార్లు వారు చేసే వీడియోలు నవ్వులపాలయ్యేలా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం  తెలియలేదు. అయితే టిక్‌టాక్‌ పిచ్చిలో మునిగిపోయి పక్కనే ఏం ఉన్నాయన్న సంగతి కూడా మరిచిపోయేవారు మాత్రం తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. (పేపర్‌ రైలు.. ఆశ్చర్యపోయిన రైల్వే మంత్రిత్వ శాఖ)

ఇంతకు వీడియోలో ఏముందంటే.. ఒక యువతి త‌మ అపార్ట్‌మెంట్ దగ్గరగా ఉన్న రోడ్డు మీద డ్యాన్స్ చేస్తుంది. సడెన్‌గా ఒక కుక్క వచ్చి ఆమె వెనకాల నిలబబడింది. అయితే అప్పటికే సీరియస్‌గా టిక్‌టాక్‌లో లీనమైపోయి ఉన్న ఆమె పక్కన ఏం ఉందో కూడా పట్టించుకోలేదు. ఇదే మంచి స‌మ‌యం అని భావించిన కుక్క ఒక‌సారిగా యువతిని కరవడానికి ప్యాంట్‌ను పట్టుకుంది. దీంతో ఆమె భ‌య‌ప‌డి కుక్క‌ను వ‌దిలించుకొని అక్కడి నుంచి పారిపోయింది. యువతి డ్యాన్స్ వీడియో పాపుల‌ర్ అయ్యేదో లేదో తెలియ‌దు కాని వీడియోలోని కుక్క మాత్రం హీరో అయిపోయింది.' అందుకే ఇలాంటివి చేసేటప్పుడు పక్కన ఏం ఉన్నాయో చూడాలి'.. 'రోడ్లు మీద చేస్తే ఇలాగే ఉంటుంది.. బాగా తిక్క కుదిరింది' అంటూ నెటిజన్లు నవ్వుకుంటూనే కామెంట్లు పెడుతున్నారు. (సింహాల వల్ల కాలేదు: చిరుతలు సాధించాయి!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top