దసరా సెలవులు.. ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? | State Wise School Holidays in Navaratri | Sakshi
Sakshi News home page

దసరా సెలవులు.. ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా?

Oct 8 2026 1:46 PM | Updated on Oct 8 2026 2:10 PM

State Wise School Holidays in Navaratri

న్యూఢిల్లీ: దసరా పండుగ ప్రారంభం కానుండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దసరా, దుర్గాపూజ, విజయదశమి, లక్ష్మీపూజ తదితర పండుగల సందర్భంగా వివిధ రాష్ట్రాలలో సెలవులు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ: అక్టోబర్ 20న దసరా/విజయదశమి సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 26న వాల్మీకి జయంతి సందర్భంగా కూడా సెలవు ఉంటుంది.

ఉత్తరప్రదేశ్: అక్టోబర్ 20న దసరా సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

బిహార్: అక్టోబర్ 5న జితియా వ్రతం సందర్భంగా సెలవు ఉంటుంది. దుర్గాపూజ సందర్భంగా అక్టోబర్ 17 నుంచి 21 వరకు పాఠశాలలు మూసివేయనున్నారు.

పశ్చిమ బెంగాల్: అక్టోబర్ 10న మహాలయ/దేవీపక్షం సందర్భంగా సెలవు ఉంటుంది. దుర్గాపూజ, లక్ష్మీపూజ సందర్భంగా అక్టోబర్ 15 నుంచి 26 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.

ఒడిశా, అసోం: దుర్గాపూజ సందర్భంగా అక్టోబర్ 17 నుంచి 21 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

హర్యానా: అక్టోబర్ 20న దసరా, అక్టోబర్ 26న మహర్షి వాల్మీకి జయంతి, అక్టోబర్ 29న కర్వాచౌత్ సందర్భంగా సెలవులు ఉంటాయి.

కర్ణాటక: దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచి 21 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

తెలంగాణ: అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 22 వరకు

ఆంధ్రప్రదేశ్: అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 21 వరకు

దేశవ్యాప్తంగా అక్టోబర్ 20న దసరా/విజయదశమి సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది.అలాగే నవంబర్ 8న దీపావళి/కాళీపూజ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ఉండనుంది. అయితే పాఠశాలల సెలవుల తేదీలు రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖల నిర్ణయాల ప్రకారం మారే అవకాశం ఉన్నందున విద్యార్థులు తమ పాఠశాల అధికారిక సెలవుల జాబితాను కూడా పరిశీలించడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement