ఇక వర్షాతిరేకం | Southwest Monsoon Arrives In Kerala | Sakshi
Sakshi News home page

ఇక వర్షాతిరేకం

Jun 5 2026 3:53 AM | Updated on Jun 5 2026 3:53 AM

Southwest Monsoon Arrives In Kerala

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు  

కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో మొదలైన వర్షాలు 

న్యూఢిల్లీ: వేసవి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం ప్రకటించింది. సాధారణంగా ఈ రుతుపవనాలు జూన్‌ 1వ తేదీ నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవన కాలం(జూన్‌–సెపె్టంబర్‌) ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రుతుపవనాలు కేరళను తాకాయి.

 ‘‘నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, మొత్తం లక్షదీ్వప్‌ దీవులు, కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, కొమరిన్‌ ప్రాంతంలోని మిగిలిన భాగాలు, ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి విస్తరిస్తున్నాయి’’అని ఐఎండీ వెల్లడించింది.

 మే 26న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ గతంలో అంచనా వేసింది. అయితే, ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమైంది. వీటి ప్రభావంతో కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రుతుపవనాలు మరో వారం రోజుల్లోగా పొరుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement