మిస్‌ ఇండియా పోటీల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ర్యాంప్‌ వాక్‌.. పాత వీడియో వైరల్‌

Smriti Irani 25 Year-Old Ramp Walk Video From Miss India Goes Viral - Sakshi

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్‌ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

వీటన్నిటికంటే ముందు స్మృతి మోడల్‌గా  పనిచేశారు. దాదాపు 25 ఏళ్ల కిత్రం అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఈ విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు.బెంగాలీ-పంజాబీ కుటుంబానికి చెందిన స్మృతి.. 2000లో ఆతిష్, హమ్ హై కల్ ఆజ్ ఔర్ కల్ అనే సీరియల్స్‌ ద్వారా తొలిసారి బుల్లితెరపై కనిపించారు. ఏక్తా కపూర్ షో 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'లో తులసి విరాణిగా అందరికీ గుర్తుండిపోయారు. ఈ సీరియల్‌ ఆమెకు భారీ స్టార్‌డమ్‌ని సంపాదించిపెట్టింది.

ఆమె ఉత్తమ నటిగా వరుసగా ఐదు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు అందుకున్నారు. అంతేగాక స్మృతి ఇరానీ 25 సంవత్సరాల క్రితం 1998లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు. ఆమె టాన్జేరిన్ స్లీవ్‌లెస్ టాప్, మినీ స్కర్ట్‌లో అద్భుతంగా ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించారు. అయితే టాప్ 9కి చేరుకోలేకపోయారు. గురువారం( మార్చి23)న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న స్మృతి వీడియోను మీరూ చూడండి.

కాగా 2003లో ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె 2004లో మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2011లో తొలిసారి 2017లో రాజ్యసభకు రెండోసారి ఎన్నికయ్యారు. 2014లో అమేథీ నుంచి బరిలోకి దిగి రాహుల్‌ గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో అదే అమేథీ గడ్డపై రాహుల్‌ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top