‘దృశ్యం’ సీన్‌: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం

Skeleton Found On Police Station Compound In Gujarats Surat - Sakshi

సూరత్‌: దృశ్యం సినిమా గుర్తుందా! దాదాపు అలాంటి సంఘటన గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఖటోదర పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో మానవ అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. స్టేషన్‌లో నిలవ ఉంచిన సీజ్‌ చేసిన వాహనాలను తొలగించే క్రమంలో ఈ అస్థిపంజరం కనిపించిందని అధికారులు చెప్పారు. రెండేళ్లుగా వాహనాల తొలగింపు జరగలేదని, దీంతో తాజాగా ఈప్రక్రియను చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో ఒక పుర్రె, దిగువ అస్థి అవశేషాలు కనిపించాయని, వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని, పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు. 
(చదవండి: ఒక్క రేషన్‌ కార్డులో 68 మంది సభ్యులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top