మరో గుడ్‌న్యూస్‌: త్వరలోనే సింగిల్‌ డోస్‌​ వ్యాక్సిన్‌

Single dose vaccine in India soon? RDIF plans to bring Sputnik V Light - Sakshi

మరో గుడ్‌ న్యూస్‌ చెప్పిన డా. రెడ్డీస్‌

సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్-వీ లైట్‌  త్వరలోనే భారత మార్కెట్‌లోకి

సాక్షి, హైదరాబాద్‌:  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్‌ చేసింది. త్వరలోనే ఇది మార‍్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో తొలిడోస్‌ను హైదరాబాద్‌లో వేసింది కూడా. ఈ క్రమంలో మరో గుడ్‌ న్యూస్‌ను ఫార్మా దిగ్గజం వెల్లడించింది.  కరోనా నివారణలో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) స్పుత్నిక్-వీ సింగిల్-డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వీ లైట్‌’ను త్వరలో భారత్‌కు తీసుకురావాలని యోచిస్తోంది.

ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ కిరిల్ డిమిత్రోవ్ మాట్లాడుతూ, త్వరలోనే భారతదేశంలో స్పుత్నిక్-వీ లైట్‌ను కూడా లాంచ్‌ చేయాలని భావిస్తున్నామన్నారు. అదే జరిగితే సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్-వీ లైట్  దేశంలో విడుదలైన తొలి టీకా అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా, జాన్సన్ అండ్‌  జాన్సన్‌ మాత్రమే సింగిల్-మోతాదు వ్యాక్సిన్‌ తీసుకొచ్చింది. స్థానిక సరఫరా ప్రారంభమైనప్పుడు టీకా ధర తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది దేశంలో 850 మిలియన్లకు పైగా టీకాలను ఉత్పత్తి చేయాలని రష్యా భావిస్తోందని డిమిత్రోవ్ చెప్పారు. (సింగిల్‌ డోస్ స్పుత్నిక్ లైట్ వచ్చేసింది: రష్యా)

మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో భారతీయులు ఆరోగ్యంగాసురక్షితంగా ఉండేలా దేశీయ టీకా డ్రైవ్‌కు తోడ్పడటం తమ అతిపెద్ద ప్రాధాన్యత అని సంస్థ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  జీవీ ప్రసాద్ వెల్లడించారు.అత్యంత ప్రభావవంతమైన ఈ టీకా తయారీని త్వరలోనే దేశంలో మొదలవుతుందన్నారు.  91.6 శాతం ప్రభావవంతమైన ఈ వ్యాక్సిన్‌  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండింటి కంటే ఎక్కువ సమర్థత రేటు దీని సొంతమని తెలిపారు. డబుల్ డోస్ స్పుత్నిక్-వీ ని భారత మార్కెట్లో విడుదల చేసిది. టీకా ధర మోతాదుకు రూ .995.(రూ .948 + 5శాతం జీఎస్‌టీ)గా నిర్ణయించిన సంగతి  తెలిసిందే.

చదవండి: కోవిడ్‌ మరణాల లెక్కలు: ఐహెచ్‌ఎంఈ షాకింగ్‌ స్టడీ

దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-05-2021
May 14, 2021, 21:25 IST
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని దిల్షద్‌ గార్డెన్‌ నివాసి అయిన శశాంక్‌‌ శేఖర్‌(26) పుట్టుకతోనే అంధుడు. అదే లోపం ఉన్న మరో...
14-05-2021
May 14, 2021, 20:40 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య...
14-05-2021
May 14, 2021, 18:52 IST
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్‌ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల...
14-05-2021
May 14, 2021, 17:51 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,88,803...
14-05-2021
May 14, 2021, 16:13 IST
పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. మానసిక రుగ్మతలైన....
14-05-2021
May 14, 2021, 15:55 IST
న్యూఢిల్లీ: కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన...
14-05-2021
May 14, 2021, 14:45 IST
కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): పాతికేళ్ల గురు శిష్యుల అనుబంధం వారిది.. అయితే ఆ అనుబంధాన్ని కోవిడ్‌ చిదిమేసింది. కోవిడ్‌ కారణంగా...
14-05-2021
May 14, 2021, 14:40 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రెండో దశలో  రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో  ఊరటనిచ్చే సమాచారం స్పుత్నిక్-వీ టీకా స్వీకరణ షురూ కావడం. రెండు...
14-05-2021
May 14, 2021, 14:39 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేనప్పుడు టీకా తీసుకోవాలని ప్రజలను కోరడం ఏంటని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రశ్నించింది....
14-05-2021
May 14, 2021, 14:07 IST
డెహ్రాడూన్: భారత్‌లో కరోనా రెండో దశ విరుచుకుపడుతోంది. మహమ్మారి కట్టడికి రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య...
14-05-2021
May 14, 2021, 13:48 IST
న్యూఢిల్లీ : చిన్నారిని కాపాడేందుకు వాళ్ల కుటుంబం సాయశక్తులా ప్రయత్నించారు. కానీ మాయదారి కరోనా 5నెలల చిన్నారిని కబలించింది. ఆరు రోజులుగా...
14-05-2021
May 14, 2021, 13:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో దేశంలో అందుబాటులోకి రానున్న రష్యా స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ధర రూ.995.40గా ఉండనుంది. రష్యానుంచి దిగుమతి చేసుకునే...
14-05-2021
May 14, 2021, 12:12 IST
ఢిల్లీకి చెందిన ఓ 30 సంవత్సరాల యువతి కరోనా కారణంగా తన ప్రాణాలను కోల్పోయింది.
14-05-2021
May 14, 2021, 08:18 IST
భారత జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తొలి డోసును గురువారం తీసుకున్నాడు.
14-05-2021
May 14, 2021, 05:27 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వచ్చి మూడురోజులు దాటినా తగ్గలేదంటే జాగ్రత్త పడాల్సిందే. ఐదురోజులు దాటితే ప్రమాదానికి దారితీసే...
14-05-2021
May 14, 2021, 05:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరులకు అందజేస్తున్న కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా రెండు డోస్‌ల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్ర...
14-05-2021
May 14, 2021, 05:01 IST
న్యూఢిల్లీ: కోవాగ్జిన్‌ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ అంగీకరించింది. నీతి ఆయోగ్‌...
14-05-2021
May 14, 2021, 04:49 IST
ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా... మరోవైపు జపాన్‌ ప్రజలు నిరసనలు చేస్తున్నా... టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలు ఆగిపోవని అంతర్జాతీయ ఒలింపిక్‌...
14-05-2021
May 14, 2021, 04:28 IST
హిమాయత్‌నగర్‌: ‘సార్‌.. మా నాన్న చనిపోయేలా ఉన్నాడు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి. వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్‌ చేయాలని సిస్టర్‌ చెప్పారు....
14-05-2021
May 14, 2021, 04:17 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన పరిశ్రమకూ కోవిడ్‌–19 దెబ్బ పడింది. తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు వైరస్‌ బారిన పడడం,...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top