దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే?

 Imported Sputnik V vaccine to cost Rs995.40 per shot - Sakshi

రష్యా  స్పుత్నిక్-వీ వ్యాక్సిన్  ధర  995.40

దేశీయంగా తయారైతే ధర  తగ్గవచ్చు

సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో దేశంలో అందుబాటులోకి రానున్న రష్యా స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ధర రూ.995.40గా ఉండనుంది. రష్యానుంచి దిగుమతి చేసుకునే ఈ వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం వెల్లడించింది. దిగుమతి చేసుకున్న మోతాదుల ధరలో మోతాదుకు ఐదు శాతం జీఎస్టీ ఉంటుంది. భారతదేశంలో తయారైతే ఈ టీకా ధర ఇంకా కొంచెం చౌకగా అందుబాటులోకి వస్తుందని డా.రెడ్డీస్‌ తెలిపింది. 

వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మార్కెట్లో లభించే అవకాశం ఉందని కేంద్రం గురువారం తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు లభిస్తున్నాయి. వాక్సిన్ కొరత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో రష్యా వాక్సిన్ రాకతో ఆ కొరత తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. 91.6 శాతం సామర్థ్యం కలిగిన స్పుత్నిక్-వీ  భారతదేశంలో ఉపయోగం కోసం ఆమోదించబడిన మూడవ టీకా అయిన సంగతి తెలిసిందే. 

చదవండి :  కోవీషీల్డ్‌ డోసుల గ్యాప్‌: పూనావాలా స్పందన
గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి
కోవిడ్‌ ఫండ్‌: క్రిప్టో కరెన్సీ బిలియనీర్‌ భారీ విరాళం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top