కరోనా: మరో గుడ్‌ న్యూస్‌ చెప్పిన డా.రెడ్డీస్‌

 Dr. Reddy in talks to bring single-dose Sputnik vaccine into India - Sakshi

 సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్‌-వీ లైట్‌ టీకా కోసం చర్చలు: రెడ్డీస్‌

స్పుత్నిక్‌-వీ టీకా సరఫరా కోసం ప్రయత్నాలు

సాక్షి,  హైదరాబాద్‌:  కరోనా  మహమ్మారి చికిత్సలో డీఆర్‌డీవో రూపొందించిన  కీలక డ్రగ్‌ను ఇటీవల విడుదల చేసిన దేశీయ ఫార్మా  దిగ్గజం డా.రెడ్డీస్‌ మరో శుభవార్త అందించింది. రష్యాకు చెందిన సింగిల్‌ డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ లైట్‌ టీకాను  దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు  ప్రయత్నిస్తోంది.  ఈ మేరకు  ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ ప్రతినిధి రాయిటర్స్‌కు తెలిపారు. 

గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ఈ సింగిల్-డోస్ వ్యాక్సిన్‌ను రష్యా ఇప్పటికే ఆమోదించింది. అనేక దేశాలలోదీని ట్రయల్స్ కొన సాగుతున్నాయి. స్పుత్నిక్ లైట్‌ టీకాను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు రష్యా తయారీదారు, దాని భారతీయ భాగస్వామ్య కంపెనీలతో సహా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నియంత్రణ సంస్థ అధికారులను ఇటీవల ఆదేశించింది. అనుకున్నట్టుగా అనుమతులు మంజూరైతే, దేశంలో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్‌ డోస్‌ టీకా స్పుత్నిక్‌-వీ లైట్‌ కానున్నది. ఈ నేపథ్యంలో రెగ్యులేటరీ ఆమోదం కోరుతూ వచ్చే రెండు వారాల్లో కంపెనీ దరఖాస్తు చేయనుంది. స్పుత్నిక్ వ్యాక్సిన్ వెబ్‌సైట్ ప్రకారం సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకా 79.4 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

కాగా రష్యన్ స్పుత్నిక్-వీ  వ్యాక్సిన్‌ అత్యవసర ఉపయోగానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీజఐ) నుండి అనుమతి పొందిన మూడవ టీకాగా నిలిచిన సంగతి తెలిసిందే. డాక్టర్ రెడ్డి లాబ్స్‌ ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ టీకాను వినియోగిస్తున్నారు. అలాగే వచ్చే నెల మధ్యలో దేశంలో వాణిజ్యపరంగా ప్రారంభించాలని భావిస్తున్న ఈ రెండు  డోసుల స్పుత్నిక్‌- వీ వ్యాక్సిన్‌ సరఫరా కోసం  కూడా రెడ్డీస్‌  అటు కేంద్రం, ఇటు ప్రైవేటు రంగాలతో చర్చిస్తోంది.

చదవండి: కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు
బుల్‌ రన్‌: రాందేవ్‌ అగర్వాల్‌ సంచలన అంచనాలు
వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top