
ముంబై: మహారాష్ట్రలో మరాఠీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తరుణంలో ఇప్పుడు ఆ భాష తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే విషయంపై సీజేఐ బీఆర్ గవాయ్ సరదాగా స్పందించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 6) ముంబైలోని తాను చదువుకున్న చిన్ననాటి స్కూల్‌ను సందర్భించిన గవాయ్.. స్కూల్ పిల్లలతో సరదాగా గడిపారు.
దీనిలో భాగంగా ఆయన మాట్లాడే క్రమంలో మరాఠీ భాషలో మాట్లాడాలా? లేక ఇంగ్లిష్‌లో మాట్లాడాలా? అనే సందిగ్ధత ఆయనకు కూడా ఏర్పడింది. ‘ఇప్పుడు నేను మరాఠీలో మాట్లాడాలా?, లేక ఇంగ్లిష్‌లోనా?’ అని అక్కడున్న టీచర్‌ను అడిగారు. మేడమ్ అయితే మరాఠిలో చక్కగా మాట్లాడారు. కానీ తాను మరాఠీలో మాట్లాడితే అంతా అర్థం చేసుకుంటారు కదూ..? అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు
దీని తరువాత సీజేఐ గవాయ్.. తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు. తాను మాతృభాషలో మాట్లాడటంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు .. ప్రశంసల సైతం అందుకున్నారు.
గవాయ్ తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు, తన మాతృభాషలో మాట్లాడటానికి ఎంచుకున్నందుకు అందరి దృష్టిని మరియు ప్రశంసలను పొందారు.
మహారాష్ట్రలో మరాఠీ వాడకాన్ని అమలు చేయడం లేదా ప్రోత్సహించడం చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో, ముఖ్యంగా ప్రముఖులు మరియు రాజకీయ నాయకులతో కూడిన ఇటీవలి వివాదాల తర్వాత ఆయన వ్యాఖ్యలు వచ్చాయి.
తాను చదువుకున్న చికిత్సక్ సముహ్ శిరోద్కర్ పాఠశాలలోని తరగతి గదులను కూడా సందర్శించారు. ఇక్కడ తన పూర్వ విద్యార్థులతో సమావేశమయ్యారు సీజేఐ. ఈ క్రమంలోనే మాతృభాషలో చదువుకోవడం వల్ల విషయం లోతైన అవగాహన ఏర్పడుతుందని, అది జీవితాంతం మనతో పాటే ఉండే అత్యంత అమూల్యమైనదిగా ఆయన అభివర్ణించారు.