Several Students Dead In School Bus Accident At Manipur Noney District - Sakshi
Sakshi News home page

School Bus Accident: స్కూల్‌ స్టడీ టూర్‌లో విషాదం.. ఏడుగురు విద్యార్థినులు దుర్మరణం

Dec 21 2022 2:59 PM | Updated on Dec 22 2022 9:10 AM

Several Students Dead In School Bus Accident Manipur Noney District - Sakshi

విహార యాత్రలో విషాదం నెలకొంది. బస్సు బోల్తా పడడంతో విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.

ఇంఫాల్‌: మణిపూర్‌లోని నోనీ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యారి్థనులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడి ఏడుగురు పిల్లలు విగత జీవులయ్యారు. 25 మంది గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని లాంగ్‌సాయ్‌ సమీపంలో ఓల్డ్‌ చాచర్‌ రోడ్డుపై ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

థాంబాల్ను హయ్యర్‌ సెకెండరీ స్కూల్‌ విద్యార్థినులు స్టడీ టూర్‌ కోసం బస్సులో ఖౌపూమ్‌కు బయలుదేరారు. మధ్యలో బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఇంఫాల్‌లోని ఆసుపత్రులకు తరలించారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ ప్రకటించారు. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement