Novavax సెప్టెంబరుకే, పిల్లలపై ట్రయల్స్‌: సీరం కీలక ప్రకటన

Serum may launch  Novavax vaccine in India by September: CEO Adar Poonawalla - Sakshi

సెప్టెంబరు నాటికే‌ నోవావాక్స్‌

గ్లోబల్ డేటా ఆధారంగా అనుమతికి దరఖాస్తు చేస్తాం: సీరం

పిల్లలపై కూడా ట్రయల్స్‌ నిర్వహించే యోచన  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతి త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో  సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) గుడ్‌ న్యూస్‌  చెప్పింది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ 'నోవావాక్స్' క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదార్ పూనావల్లా తెలిపారు. అంతేకాదు పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభించాలని  యోచిస్తున్నట్టు కూడా వెల్లడించారు. 

నోవావాక్స్‌ టీకా ఒక మాదిరి నుంచి తత్రీవమైన వైరస్‌ బాధితుల్లో 100 శాతం రక్షణనిస్తోందని, సగటున నోవావాక్స్‌ వ్యాక్సిన్ 90 శాతం స‌మ‌ర్ధవంతమైందని పూనావల్లా వెల్లడించారు. అయితే ,గ్లోబల్‌ ట్రయల్స్ డేటా ఆధారంగా తాము లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.నవంబర్ నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం పొందితే కంపెనీ సెప్టెంబరు నాటికి నోవావాక్స్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే పిల్లలకు టీకా అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ ను జూలైలో ప్రారంభించాలని యోచిస్తున్నామనీ దీనిపై త్వరలోనే డ్రగ్ రెగ్యులేటరీ అనుమతినికోరనున్నామని పూనవల్లా తెలిపారు.

కాగా నోవావాక్స్  అన్ని ర‌కాల వేరియంట్ల‌పై సమర్ధవంతంగా ప‌నిచేస్తుంద‌ని కలుసుకుంది, నోవావాక్స్ ఇటీవల (జూన్ 14న) ప్రకటనలో తెలిపింది. అమెరికా, మెక్సికోలోని 119 సైట్లలో 29,960 మందిపై ట్రయల్స్ చేసినట్టు పేర్కొంది. నోవావాక్స్ టీకాల‌ను సులువుగా నిల్వ చేయ‌వ‌చ్చు. రవాణా కూడా ఈజీగా ఉంటుంద‌ని నోవావాక్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టాన్లీ సీ ఎర్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

చదవండి: ట్విటర్‌కు మరోషాక్‌, కేసు నమోదు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-06-2021
Jun 16, 2021, 10:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే మంగళవారంతో పోల్చితే.. దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. భారత్‌లో...
16-06-2021
Jun 16, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. ప్రజలు మాస్క్‌లు ధరించడం,...
16-06-2021
Jun 16, 2021, 08:14 IST
సాక్షి, మంచిర్యాలటౌన్‌: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే గర్భం దాల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది....
16-06-2021
Jun 16, 2021, 07:01 IST
న్యూఢిల్లీ: రెండో వేవ్‌లో పిల్లలు, యువత అధికంగా ప్రభావితమయ్యారన్న వాదనను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. 1 నుంచి 20...
16-06-2021
Jun 16, 2021, 06:38 IST
న్యూయార్క్‌: చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీకయిందని, దీనిపై మరింత లోతైన విచారణ అవసరమని అమెరికా సహా...
16-06-2021
Jun 16, 2021, 04:26 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నెగెటివ్‌ వచ్చిన అనంతరం మహమ్మారితో పోరాటం పూర్తయినట్లేనా అంటే... కాదంటున్నారు నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న...
16-06-2021
Jun 16, 2021, 04:18 IST
సాక్షి, అమరావతి: భవిష్యత్తులో కరోనాకు చెక్‌ పెట్టేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా ఏర్పాట్లుచేయాలని...
16-06-2021
Jun 16, 2021, 02:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ఫ్యూ మూడు రోజులకు ఒకసారి...
15-06-2021
Jun 15, 2021, 20:14 IST
డెహ్రాడూన్‌: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉదృతి కాస్త తగ్గింది. గడిచిన రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు మూడు లక్షల...
15-06-2021
Jun 15, 2021, 20:10 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1556 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం...
15-06-2021
Jun 15, 2021, 18:51 IST
కోల్‌కతా: కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాకా కొందరు తమ శరీరంలో అయస్కాంత లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవలే నాసిక్‌కు చెందిన...
15-06-2021
Jun 15, 2021, 17:50 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో  96,153 మంది సాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 5,741 కరోనా కేసులు బయటపడ్డాయి....
15-06-2021
Jun 15, 2021, 12:59 IST
వాషింగ్టన్‌: దేశీయ పార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే. అయితే తాజాగా కోవాగ్జిన్‌ తీసుకున్న భారతీయ...
15-06-2021
Jun 15, 2021, 11:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ కాలంలో దేశంలో దాదాపు 73 శాతం వృద్ధులపై...
15-06-2021
Jun 15, 2021, 10:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో...
15-06-2021
Jun 15, 2021, 09:40 IST
న్యూఢిల్లీ: పీఎం కేర్స్‌ నిధుల నుంచి దేశంలోని పలు జిల్లాల్లో 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ చీఫ్‌...
15-06-2021
Jun 15, 2021, 09:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఢిల్లీకి వచ్చే వారికి ఇకపై ఆర్టీ–పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు అవసరం లేదని ఢిల్లీ...
15-06-2021
Jun 15, 2021, 08:24 IST
సాక్షి, నెట్‌వర్క్‌ (నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 304మంది మహమ్మారి బారిన...
15-06-2021
Jun 15, 2021, 05:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు....
15-06-2021
Jun 15, 2021, 05:09 IST
తిరుపతి తుడా: కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యమే సగం బలం అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top