
అన్నానగర్(తమిళనాడు): కుక్క కరించిందని ఓ ఐఏఎస్ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై రాయపేట మాసిలామణి రోడ్డుకు చెందిన విమల్ ఆనంద్ (46). కోర్టు న్యాయవాది. ఇతను ప్రతిరోజూ బాలాజీ నగర్, మొదటి వీధిలో వాకింగ్ వెళుతుంటాడు. అదేవిధంగా శుక్రవారం కూడా భార్య ఉమామహేశ్వరితో కలిసి వాకింగ్ చేస్తున్నాడు.
ఉమామహేశ్వరి ఐఏఎస్ అధికారి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తుంది. పక్కనే నివాసముంటున్న సురేష్ అతని భార్య శ్రీజ తమ పెంపుడు కుక్కతో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఉమామహేశ్వరిని కుక్క కరిచింది. దీంతో కుక్క యజమానులపై చర్యలు తీసుకోవాల ని రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.