అధికారులను జైలులో పెడితే ఆక్సిజన్‌ రాదు: సుప్రీంకోర్టు

SC On Contempt Notice Issued by Delhi HC to Centre - Sakshi

ఢిల్లీకి 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఇవ్వాలి

కేంద్రం తీరు ఆమోదయోగ్యం కాదన్న సుప్రీంకోర్టు

ఢిల్లీకి ఆక్సిజన్‌ సరఫరాపై వివరాలు ఇవ్వాలని కేంద్రానికి ఆదేశం

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ధిక్కరణ ఉత్తర్వులపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది. గత మూడు రోజులుగా దేశ రాజధానికి కేంద్రం ఎంత ఆక్సిజన్‌ను సరఫరా చేసిందని కోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. ‘‘ఢిల్లీకి ప్రతిరోజు 490 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం అని.. ఈ మేరకు సరఫరా చేస్తున్నాం’’ అని తెలిపారు. 

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. ‘‘అధికారులను జైలులో పెట్టడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం రెండు కోవిడ్‌ కట్టడికి ఉత్తమంగా కృషి చేయాలి. ఢిల్లీకి ఇవ్వాల్సిన కోటా మేరకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయండి’’ అని కోర్టు ఆదేశించింది. ఢిల్లీకి ఆక్సిజన్‌ సరఫరాపై వివరాలు ఇవ్వాలని కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 

చదవండి: సెకండ్‌వేవ్‌: లాక్‌డౌన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top