జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌

Published Thu, Aug 25 2022 2:42 PM

Relief for Hyderabad Journalists in the Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 

ఈ మేరకు జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు 12 ఏళ​ క్రితం ప్రభుత్వాన్ని స్థలాన్ని కేటాయించింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడటం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి?. రూ.8వేల నుంచి రూ.50వేల వరకు జీతం తీసుకునే 8వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. 

చదవండి: (జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌)

వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్‌ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి మేం అనుమతిస్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్‌ ముందు లిస్ట్‌ చేయాలని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. 

చదవండి: (స్కాట్‌లాండ్‌లో పలమనేరు విద్యార్థి మృతి)

Advertisement
 
Advertisement
 
Advertisement