నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి

Real hero soonu sood to help net jee students - Sakshi

విద్యార్థులకు అండగా సోనూ సూద్

సౌకర్యాల లేమి కారణంగా ఏ ఒక్కరూ ఎగ్జామ్ మిస్ కావొద్దు!

సాక్షి, ముంబై: కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన  బాలీవుడ్ నటుడు సోనూ సూద్  ప్రస్తుత పరిస్థితుల రీత్యా తనదైన శైలిలో కార్య రంగంలోకి దిగిపోయారు. ఈ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించి తీరుతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  కరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్న సోనూ సూద్ అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు.  (నీట్, జేఈఈల వాయిదా ఉండదు!)

ఒకవైపుకోవిడ్-19 రిస్క్, మరోవైపు తండ్రి పేదరికం, లోన్ల బెడద తదితర ఆర్థిక కష్టాల నేపథ్యంలో చాలాదూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లాలి.. దయచేసి సాయం చేయండి అంటూ కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థి ఆవేదనను  సోనూ షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్  తాజా నిర్ణయం తీసుకున్నారు.  (విద్యార్థుల లైఫ్‌ను రిస్క్‌లో పెట్టలేం: సోనూ సూద్‌)

నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఖాయమైతే..ఆయా ప్రాంతాల విద్యార్థులు పరీక్షా కేంద్రాలను చేరుకోవడానికి కావల్సిన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా బిహార్, అస్సాం, గుజరాత్ లోని వరద బాధిత ప్రాంతాలలో పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులందరికీ నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. బాధిత విద్యార్థులు దీనికి సంబంధించిన సమాచారాన్ని తనకు అందించాలని, ఏ ఒక్కరు కూడా ఈ పరీక్ష మిస్ కావడానికి వీల్లేదని ట్వీట్ చేశారు.   (ఫస్ట్ కారు కొన్నపుడు కూడా ఇలా లేదు : సోనూసూద్)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top