వైరల్‌: అలకబూనిన శునకం.. కారణం ఏంటి! | Sakshi
Sakshi News home page

వైరల్‌: అలకబూనిన శునకం.. కారణం ఏంటి!

Published Sun, Jun 6 2021 3:02 PM

Ram Kapoor Shares His Dog Feels Sad Video Went Viral - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు రామ్‌ కపూర్‌ తరచూ వివిధ విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అతని పెంపుడు కుక్క పొపాయ్‌ చాలా విచారంగా ఉన్న ఓ వీడియోను "అతను పార్కుకు వెళ్లి తన ప్రేయసితో కలిసి ఉండలేకపోతున్నానని బాధపడుతున్నాడు" అనే క్యాప్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో పొపాయ్‌ ఏదో మిస్‌ అవుతున్నట్టు తన గడ్డాన్ని డ్రస్సర్‌పై ఉంచి విచారం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది.

కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 65,000 మంది నెటిజన్లు వీక్షించగా.. వందల మంది లైక్‌ కొట్టారు. "కుక్క తన గడ్డం ఆ డ్రస్సర్‌పై ఎలా ఉంచిందో...కానీ నాకు చాలా నచ్చింది, అందంగా ప్రభావవంతంగా ఉంది." అంటూ నటుడు నికి వాలియా కామెంట్‌ చేశారు. ఇక కపూర్ భార్య గౌతమి కపూర్ కూడా స్పందిస్తూ.. "ఈ పేదవాడిని ఒంటరిగా వదిలేయండి" అని రాసుకొచ్చారు. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు కుక్క నటనకి ఫిదా అవుతున్నారు.


(చదవండి: ఎల్లలు దాటిన ఇండో-జర్మన్‌ ప్రేమ కథ)


 

Advertisement
 
Advertisement
 
Advertisement