డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు? | Rakul And Sara Alikhan Names In Bollywood Drugs Case | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు?

Sep 12 2020 8:18 AM | Updated on Sep 12 2020 12:43 PM

Rakul And Sara Alikhan Names In Bollywood Drugs Case - Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతికి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి ఉన్నతాధికారుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ తీసుకునే అలవాటున్న మరికొంతమంది బాలీవుడ్‌ హీరోయిన్ల గుట్టు బయటపెట్టినట్లు సమాచారం. వీరిలో ప్రముఖ హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్ట పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రియా వెల్లడించిన దాదాపు 25 మంది పేర్లతో ఎన్‌సీబీ అధికారులు ఓ లిస్టు తయారు చేసినట్లు, డ్రగ్స్‌ వాడకంతో సంబంధం ఉన్న బాలీవుడ్‌ ప్రముఖులందరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.  ( జైల్లో రియాకు కనీసం ఫ్యాన్‌, బెడ్‌ కూడా లేదా..)

కాగా, సెప్టెంబర్‌ 8 నార్కోటిక్స్‌ కేసులో అరెస్టయిన రియా, ఆమె సోదరుడు షోవిక్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. వీరి పిటిషన్లపై నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్, సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎస్‌) చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్‌ విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement