ప్రధాని కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవు

Rahul Gandhi Says PM Tears Did Not Save Lives - Sakshi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్, వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా కరోనాని కట్టడి చేయగలమని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మంగళవారం కరోనాపై శ్వేత పత్రాన్ని రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం కేంద్రాన్ని నిందించడానికి కాదని, కరోనాని ఎదుర్కోవడానికి కేంద్రానికి వీలైనంత సాయపడడానికేనని ఆయన చెప్పారు.

కరోనా ఫస్ట్, సెకండ్‌ వేవ్‌ ఎదుర్కోవడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని రాహుల్‌ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా మరణాలపై కన్నీళ్లు పెట్టుకోవడాన్ని రాహుల్‌ ప్రస్తావిస్తూ కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆ మరణాలు సంభవించి ఉండేవి కావని అన్నారు. ‘‘ప్రధాని కన్నీళ్లు ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయాయి. మృతుల కుటుంబాల కన్నీళ్లను తుడవలేకపోయాయి.  కానీ ఆక్సిజన్‌ సరఫరా ప్రజల ప్రాణాలను కాపాడి ఉండేది’’ అని రాహుల్‌ అన్నారు. సెకండ్‌ వేవ్‌ని సీరియస్‌గా తీసుకోకుండా ప్రధానమంత్రి బెంగాల్‌ ఎన్నికలపై దృష్టి పెట్టడం శోచనీయమని అన్నారు.

మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాలి 
దేశంలో ప్రతీ ఒక్కరికీ టీకా వీలైనంత వేగంగా ఇవ్వాలని రాహుల్‌ చెప్పారు. వ్యాక్సిన్‌  పంపిణీలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. కరోనాని ఎదుర్కోవడంలో గతంలోని వైఫల్యాలను ఇప్పుడు సరిదిద్దుకోవాలని సూచించారు. ఆక్సిజన్‌ వంటి సదుపాయాలు పెంచాలని, నిరుపేదలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని, కోవిడ్‌ నష్టపరిహారం నిధులను ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో రాహుల్‌ రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ శ్వేతపత్రాన్ని బీజేపీ తిప్పి కొట్టింది. కరోనాపై పోరాటంలో ఏ కాస్త మంచి జరిగిందని భావించినా మధ్యలో రాహుల్‌ వచ్చి ఏదో ఒకటి చేస్తారని బీజేపీ నేత సంబిత్‌ పాత్రా అన్నారు.

చదవండి: మాజీ ప్రధాని దేవెగౌడకు భారీ జరిమానా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-06-2021
Jun 22, 2021, 20:11 IST
కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్‌–వీ భారత్‌లో కోవిడ్‌ నిరోధానికి వాడుతున్న టీకాల పేర్లివి.  ఒకట్రెండు నెలల్లో మరికొన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి! వీటిల్లో...
22-06-2021
Jun 22, 2021, 15:21 IST
వెబ్‌డెస్క్‌: కరోనాకే కొత్త పాఠాలు నేర్పింది చైనా. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను నిజం చేస్తూ కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంతో...
22-06-2021
Jun 22, 2021, 08:59 IST
విజయవాడ భవానీపురానికి చెందిన పరిమళ సత్యవతికి గుండె నిబ్బరం పెరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం.. పగటిపూట కర్ఫ్యూ సడలిస్తున్నారనే...
22-06-2021
Jun 22, 2021, 08:08 IST
అహ్మదాబాద్‌: జూలై–ఆగస్టు నెలల్లో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హోంమంత్రి అమిత్‌షా సోమవారం పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని...
22-06-2021
Jun 22, 2021, 07:36 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వల్ల మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన...
22-06-2021
Jun 22, 2021, 06:34 IST
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటులో భారత్‌ ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో వరుసగా 14వ రోజు పాజిటివిటీ రేటు 5...
22-06-2021
Jun 22, 2021, 06:06 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలి రోజే దేశం మొత్తం మీద ప్రజలకు 85.15 లక్షలకు...
22-06-2021
Jun 22, 2021, 00:49 IST
బారిపదా: కరోనా టీకా తీసుకున్న వ్యక్తికి కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మరో డోస్‌ టీకాను ఇచ్చిన ఘటన ఒడిశాలో...
22-06-2021
Jun 22, 2021, 00:34 IST
►మానసిక ఒత్తిడిని తగ్గించే మాత్రల వినియోగం ఒక ఏడాది కాలంలోనే రూ.40 కోట్లకు పైగా పెరగడం సమస్య తీవ్రతను స్పష్టం...
21-06-2021
Jun 21, 2021, 09:36 IST
న్యూఢిల్లీ: ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత...
21-06-2021
Jun 21, 2021, 04:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తన రికార్డును తానే అధిగమించింది. గతంలో ఒకేరోజు 6.32 లక్షల డోసులు టీకాలు...
21-06-2021
Jun 21, 2021, 00:24 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మరో వేవ్‌ విరుచుకుపడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలని ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచించింది....
20-06-2021
Jun 20, 2021, 18:38 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ముగిసింది.. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన...
20-06-2021
Jun 20, 2021, 17:10 IST
విరిసీ విరియని పువ్వుల్లారా.. ఐదారేడుల పిల్లల్లారా... అన్నాడు మహాకవి. పువ్వులు సహజసిద్ధంగా వికసించినట్లే పిల్లల్లో ఇమ్యూనిటీ సహజసిద్ధంగా పెరగాలంటున్నారు నిపుణులు....
20-06-2021
Jun 20, 2021, 12:07 IST
దుబాయ్‌: భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణలపై ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్లు యుఏఈలోని దుబాయ్ ప్రభుత్వం శనివారం...
20-06-2021
Jun 20, 2021, 12:07 IST
‘నేనిలా బతకలేను.. ట్రీట్‌మెంట్‌ ఆపేయండి!’ అని వైద్యులను కోరారు. ఆయన కోరిక మేరకు..
20-06-2021
Jun 20, 2021, 10:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. 81 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కరోనా కేసులు నయోదయ్యాయి....
20-06-2021
Jun 20, 2021, 09:59 IST
న్యూఢిల్లీ: కోవిడ్-19 బాధితులకు రూ.4 లక్షల పరిహారం చెల్లించలేమని, పరిహారం తప్పనిసరి చేసే విపత్తు నిర్వహణ చట్టం భూకంపం, వరదలు...
20-06-2021
Jun 20, 2021, 08:52 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ 51వ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్య కర్తలు శనివారం ఆయనకు...
20-06-2021
Jun 20, 2021, 08:34 IST
సాక్షి, సిరిసిల్లక్రైం: కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. గత నెల 12 నుంచి ఈ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top